కరీంనగర్ మేయర్ మానవత్వం

కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ మరోసారి తన మానవత్వాని చాటాడు. విద్యుత్తు మరమత్తులు చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి కరెంట్ పోల్ పై నుంచి కింద పడిపోయి తీవ్రగాయాలైన లైన్ మెన్ ను స్వయంగా తన కారులో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నగరంలోని కోతిరాంపూర్ లో గల శ్రీ గిద్దెపరమాండ్ల స్వామి ఆలయం ప్రాంగంలో హరితహరం పై నగర పాలక కమిషనర్ కృష్ణభాస్కర్ తో కలిసి స్థానిక కార్పోరేటర్ తో సమావేశంలో నిర్వహించిన అనంతరం మరో కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న వ్యక్తిని చూసి చలించి పోయిన మేయర్ వెంటనే స్పందించి… తన వాహనంలో అపోలో రిచ్ ఆసుపత్రికి తరలించారు. కొంత ఆర్ధిక సయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు నగర కమిషనర్ కృష్ణభాస్కర్, స్థానిక 26 డివిజన్ కార్పోరేటర్ రూప్ సింగ్, 27వ డివిజన్ కార్పోరేటర్ రవీందర్ గౌడ్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎడ్ల అశోక్, శ్రీనివాస్, గుండపడుగు హరిప్రసాద్, నగరపాలక సిబ్బంది, నాయకులు ఉన్నారు.

022

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *