ఇలాంటి రాజకీయాలు మనకొద్దు..

rajakyeem

మతం.. కులం ఈ రెండింటి ఎప్పటికీ కదిలించవద్దు.. చాలా సున్నితమైన విషయాలివి. వాటి మీద ఆధారపడే రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీ గట్రా బతుకుతున్నాయి. కానీ ఇప్పుడు కదిలించక తప్పడం లేదు.. మొన్ననే పవన్ కళ్యాన్ బీజేపీ నేతలపై ఓ సెటైర్ వేశాడు.. ‘అయ్యా మీకు గోవులపై అంత ప్రేమ ఉంటే వాటిని తినే వాల్లను చంపకుండా ప్రతీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ పరిరక్షణ కార్యకర్తలందరూ మనిషికొక గోవును పెంచుకోవాలని’ సెలవిచ్చాడు. అధికారం ఒక్కరి సొంతం కాదు.. ఈరోజు బీజేపీ ఉండొచ్చు.. రేపు కాంగ్రెస్ ఉండొచ్చు.. కానీ మతసహనం అనేది ప్రధానం.. ఇప్పుడు బీజేపీ పాలనలో అదే లోపిస్తోంది..

కుండ పోత… కరీంనగర్ నగరంలో ఆదివారం రాత్రి దాదాపు 17 సెం.మీ ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ భారీ వర్షానికి కరీంనగరమే అతలాకుతలం అయ్యింది. నగరంలోని బస్టాండ్ దగ్గర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గల ముస్లింల  ప్రార్థన స్థలమైన ఈద్గా గోడ కూలిపోయింది. ఈ ఈద్గా రోడ్డు కు మధ్యలో ఉండి రాకపోకలకు ఆటంకం కలిగిస్తోంది. దీన్ని తొలగించేందుకు అప్పట్లో అధికారులు ప్రయత్నించగా.. ముస్లింలు ఏకమై పెద్ద యుద్ధమే జరిపారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఎంఐఎం అక్బరుద్దీన్ సైతం వచ్చి ఈ ఈద్గా గోడ కూలకొట్టనీయలేదు..

కానీ మనుషులు చేయలేని పనిని ఆ దేవుడు.. వరుణ దేవుడు చేశారు. భారీ వర్షంతో ఆ ఈద్గా గోడ కూలగొట్టాడు. ఇక ఇక్కడే రాజకీయం రంగు పులుముకుంది. తెల్లారి సరికే సదురు ముస్లిం మతస్థులు ఈద్గా పునర్నిర్మాణ పనులు చేపట్టారు. దీన్ని నగర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ కార్యకర్తలతో కలిసి అడ్డుకున్నారు.. బైటాయించారు. ఆందోళన చేశారు.

మతం రంగు పులుముకుని ఈ అనార్థాలకు పాల్పడడం వల్ల ప్రజల మధ్య విద్వేషాలు రగులుతున్నాయి. ఈద్గా కోసం వాళ్లు.. మైసమ్మ గద్దె కూలిందని వీళ్లు అగ్గి రాజేయడం వల్ల అమాయాకులు చచ్చిపోతున్నారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి అపశృతులు ఎక్కువవుతున్నాయి. మతాలు, వారి ఆచారాలు నమ్మకాల విషయంలో ఈ నాయకుల సంయమనం పాటిస్తే అందరికీ మంచిది. ఎందుకంటే తరువాత జరిగే అల్లర్లలో చచ్చేది ఈ ఆందోళన చేసిన నాయకులు కాదు.. కింద అమాయకులైన ముస్లిం, హిందు యువకులే.. అందుకే నేతలు తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి రాజకీయాలు మనకొద్దు..

whatsapp-image-2016-09-10-at-11-36-07-pm

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *