Breaking News

కరీంనగర్ కలెక్టర్ కు అరుదైన గౌరవం

1222

స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ లో కరీంనగర్ జిల్లా లో పెద్ద ఎత్తున పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టినందుకు గాను కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ గారు అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో కలెక్టర్ నీతూ ప్రసాద్ కు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అవార్డును, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కలెక్టర్ సేవలను కొనియాడారు. కలెక్టర్ ఢిల్లీలో స్వచ్ఛ భారత్ అవార్డు అందుకోవడం ఆనందం కలిగించిందని కలెక్టర్ నీతూ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

కరీంనగర్ జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంలో విశేష కృషి చేస్తోన్న కరీంనగర్ కలెక్టర్ కు జాతీయ స్థాయిలో జరిగిన సదస్సులో ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ తరఫున ఎంపికైన కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ హాజరయ్యారు. కాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో స్వచ్ఛభారత్‌ కింద కరీంనగర్‌ జిల్లాలో అమలుచేస్తోన్న వివిధ పద్ధతులను ఆమె పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రణాళికలు, అధికారుల భాగస్వామ్యం, పర్యవేక్షణ వంటి వాటిపై సమగ్రంగా వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *