
కరీంనగర్ ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ గౌడ్ కు కరీంనగర్ నగర సమీపంలోని రేకూర్తి రాజాశ్రీ గార్డెన్ లో ఘన సన్మానం జరిగింది. తెలంగాణ గౌడ సంఘాల నాయకులు సుదర్శన్ గౌడ్ ను శాలువ, బొకేలతో ఘనంగా సన్మానించారు.. సుదర్శన్ గౌడ్ ఇటీవల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సర్వోన్నత అవార్డు అందుకున్నారు. ఇందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గౌడ సంఘం నాయకులు కలిసి రాజశ్రీ గార్డెన్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సుదర్శన్ గౌడ్ ను సన్మానించారు.
అంతకుముందు గౌడ సంఘం నాయకులు.. కరీంనగర్ శివారులో గల అల్గునూర్ లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి ర్యాలీగా బయలు దేరి నగరం మీదుగా రేకుర్తి రాజశ్రీ గార్డెన్ కు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం సుదర్శన్ గౌడ్ సహా పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ కు ఎంపికైన యువకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీ. రాజేశం గౌడ్, మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య గౌడ్, రిటైర్డ్ డీఎస్పీ మొగులయ్య గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపగోని సారయ్య గౌడ్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు అన్నయ్య గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ అయిు రమేశ్ గౌడ్,సీఐ మహేశ్ గౌడ్, సీఐ గురువయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద , గోదావరిఖని సత్తన్న,పొన్నం సత్యంగౌడ్ గౌడ సంఘాల నాయకులు కలర్ సత్తన్న గౌడ్, తోట రవి, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, పంజాల వేణుగోపాల్ గౌడ్, పూదరి నర్సా గౌడ్, రాజకుమారి, కోట రవి, దూలం బాలాగౌడ్, తో పాటు వేలాది మంది గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.