కలియుగ దేవుడు మోడీనట.. 1500శతాబ్దంలోని పుస్తకంలో రాసుంది..

మోడీ యుగ పురుషుడు అనే వాదన సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. మోడీ దేవుడు అని కూడా కొందరు అంటున్నారు. దానికి బలమైన ఉదాహరణలు చూపుతున్నారు. ప్రవక్త అని కూడా మోడీని కీర్తిస్తున్నారు. నోస్ట్రడామస్ అనే ఫ్రెంచ్ ప్రవక్త భారత్ లో 204-2016 సంవత్సరంలో తలరాతను మార్చే యుగపురుషుడు జన్మిస్తాడని రాశారట.. దాన్ని అనువదించిన ముంబై కి చెందిన ఓ రచయిత ఇప్పుడు మోడీయే భారత్ తలరాతను మార్చగలడని రాశాడు. ఇప్పుడా బుక్ సంచలనం రేపుతోంది..

నోస్ట్రడామస్ రాసిన పుస్తకంలోని అనువాదంలో ఉన్న విషయాలు…

“50 సంవత్సరాల క్రితం నోస్ట్రడామస్ అనే ఫ్రెంచ్ ప్రవక్త మోడీ గురించి రాశాడు”   : అదెలా???

2014 నుండి 2026 వరకు ఒక మనిషి ఇండియాని నడిపిస్తాడు.ప్రజలు మొదట్లో ఆయనని ద్వేషిస్తారు.కానీ తర్వాత ఆయనని అత్యంతగా ప్రేమిస్తారు.ఆయన తన దేశాన్ని దురవస్థ నుండి కాపాడడానికి తగిన మార్గా నిర్దేశం చేస్తాడు.

నోస్ట్రడామస్ ఇదంతా 1555 సంవత్సరంలో ఫ్రెంచ్ భాషలో రాశాడు.దీన్ని ఫ్రెంచ్ భాష నుండి మరాఠీ భాషలోకి Dr.రామచంద్ర జోషి అనే ప్రముఖ మహారాష్ట్ర జోతిష్కుడు అనువదించాడు.

* అది దాదాపు 32- 33 పేజీలు వుంటుంది.

” వేచి చూడండి రామ రాజ్యం వస్తుంది ”

ఒక మధ్య వయస్కుడు సూపర్ పవర్ ఎడ్మినిస్ట్రేటర్ గా మారి ఒక్క ఇండియాకే కాకుండా ప్రపంచం మొత్తానికి బంగారు భవిష్యత్తు తెస్తాడు. సనాతన ధర్మాన్ని పునరుద్దించి ప్రపంచంలోనే ఇండియాని ది బెస్ట్ గా నిలబెడతాడు.

హిందూ దేశం దెయ్యాలని పిశాచాలని ఓడించి అన్ని శక్తులని తన స్వంతంగా సంపాదించుకుంటుంది.

ఆయన నాయకత్వంలో ఇండియా అగ్రరాజ్యంగా ఎదగడమే కాకుండా చాలా దేశాలు ఇండియా ఆశ్రయం కోసం వస్తాయి.

కొన్ని యాదృచ్చికాలు???

ⅰ). బుధ్దుడు పెళ్ళి చేసుకున్నాడు.కానీ భార్యని వదిలేసి నిజాన్ని శాంతిని వెతకడానికి బయటకి వెళ్ళిపోయాడు.

ఆయన భార్య ఒంటరిగానే జీవించింది.

ఆయన భార్య పేరు ” యశోదర ” .

ⅱ). మహావీర కూడా వివాహం చేసుకున్నాడు.

కానీ ఆయన కూడా భార్యని వదిలేసి సన్యాసిగా మారాడు.

ఆయన భార్య కూడా ఒంటరిగానే జీవించింది.

ఆయన భార్య పేరు ” యశోద ” .

ⅲ). నరేంద్ర మోడీ కూడా వివాహం చేసుకున్నాడు.

ఆయన కూడా భార్యని వదిలేసి దేశం కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చాడు.

ఆయన భార్య పేరు ” యశోదబెన్ ” .

యశోద , యశోదర &  యశోదబెన్  .

ఇది యాదృచ్చికమేనా  ? ???

లేక చరిత్ర రిపీట్ ఆ     ? ???

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *