ఈ వైఫల్యం కడియందేనా..?

ఉమ్మడి రాష్ట్రంలో ఇన్నేళ్లు గా జరగని ఎంసెట్ లీకేజీ తెలంగాణ రాష్ట్రంలో జరగడంపై అంతటా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తెలంగాణ విద్యామంత్రి కడియం శ్రీహరి పనితీరుపై ఆదినుంచి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన తన శాఖను, శాఖ తీరును సరిగ్గా వ్యవహరించడం లేదనే ఫిర్యాదులు కేసీఆర్ కు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో టెన్త్ విద్యార్థుల వాల్యుయేషన్ లో విద్యార్థులను ఫెయిల్ చేశారని విమర్శలొచ్చాయి. పలు పరీక్షల నిర్వహణ బాగా లేదని తెలిసింది.

ఏకంగా ఇప్పుడు విద్యార్థులు కష్టపడి సంవత్సరాలు తరబడి చదివే ఎంసెట్ నే లీక్ చేశారు కొందరు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు.. దీనిపై పెద్ద దుమారం జరిగి మీడియాలో అక్రమాలంటూ వార్తలు వెల్లువెత్తాయి. దీంతో మరోసారి విద్యాశాఖ మంత్రి కడియం ఫెయిల్యూర్ పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా వరుసగా తన శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *