Breaking News

లెక్చరర్లను కడియం ఎంత మాటన్నాడు..?

11

మన పాఠశాలు, కళాశాలల్లో జరుగుతున్న తంతును డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కళ్లకు కట్టినట్టు మాట్లాడి లెక్చరర్లు, టీచర్ల కళ్లు తెరిపించారు. ఇటీవల తెలంగాణ సిద్దాంత కర్త జయశంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఇంటర్ మీడియట్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. దీనికి అతిథిగా హాజరైన కడియం లెక్చరర్లు, టీచర్లు చదువుకుని పాఠం చెప్పడం లేదని.. అసలు కొంత మంది కళశాలలకే వెళ్లడం లేదని ధ్వజమెత్తారు. జయశంకర్ లా పాఠాలు విద్యార్థులకు ప్రతీ రోజు చెప్పి మిగతా కార్యక్రమాల్లో పాల్గొనాలని కడిగిపారేశారు. తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడిని వేదికమీదే కడియం కాలేజీకి వెళ్లి పాఠాలు చెబుతున్నావా.? అంటూ ప్రశ్నించాడు.
కాగా ఈ వ్యాఖ్యలపై లెక్చరర్లు, టీచర్లు ఆందోళనకు దిగుతున్నారు.డిప్యూటీ సీఎం తమను అవమానించాడంటూ మండిపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *