
విలక్షణ చిత్రాలతో విభిన్న కథలను ఎంచుకొని భారీ హిట్ లు కొట్టే పవన్ కళ్యాణ్ మరోసారి మాస్ కథాంశంతో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. తన కొత్త చిత్రానికి ఓకే చెప్పాడు. డాలి దర్శకత్వంలో రాబోయే ఈ కొత్త చిత్రం పేరు కూడా ఖరారైంది. ‘కడప కింగ్’గా వస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాన్ నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రం కథ రాయలసీమ ఫాక్షన్ రాజకీయాలపై నడుస్తున్నట్టు తెలిసింది. ఫ్యాక్షన్ తో పాటు కామెడీ కలగలిపే ఈ మూవీతో పవన్ మరోసారి పెద్ద హిట్ కు ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాల్లో రాజకీయాలను కూడా టచ్ చేయనున్నట్టు తెలిసింది. ఇటీవల కడప కింగ్ సినిమా కోసమే పవన్ కల్యాన్ తన వేషధారణను మార్చుకున్నాడు. రాయలసీమ వ్యక్తిలా పెద్దగా మీసాలు పెంచి కనిపించారు. లండన్ లో జరిగిన తెలుగు సాంస్కృతిక ఉత్సవాల్లో ఆయన భారీ మీసకట్టు మెలివేసిన గెటప్ లో కనిపించారు. ఆ లుక్ తో నే కడప కింగ్ కోసమేనని తేలింది. దీంతో మరోసారి పవన్ అభిమానులు పండుగ చేసుకునేందుకు రెడీ అయ్యారు.