Breaking News

రజిని సినిమాకు ఆయనే లేకుండా ఫంక్షన్..

rajinikanth-kabali

ఎవరైనా సరే .. తమ చిత్రం ఆడియో ఫంక్షన్ లో పాల్గొని సినిమాకు హైప్ తీసుకురావాలనుకుంటారు.. కానీ రజినీ మాత్రం తెలుగు ప్రేక్షకులను తీవ్ర నిరాశలో ముంచెత్తారు. తమిళనాడులో చైన్నైలో నిర్వహించిన తమిళ వెర్షన్ కబాలిలో పాల్గొన్న రజినీ తెలుగు వెర్షన్ ఆడియో ఫంక్షన్ కు మాత్రం డుమ్మాకొట్టడం అభిమానులను తీవ్ర నిరాశపర్చింది.

కబాలి ఆడియో ఫంక్షన్ కు రజినీతో పాటు అతని చిరకాల మిత్రులు చిరంజీవి, మోహన్ బాబులు హాజరవుతారని అభిమానులందరూ ఆశించారు. కానీ ఏకంగా ఆయన సినిమాకు రజినీయే హాజరుకాకపోవడంతో ఇక మిగతా వారు ఎవరూ రాలేదు. దీంతో చోటా హీరోలైన నాని, వరుణ్ సందేశ్ లతో ఆడియో ఫంక్షన్ ను లాగించేశారు..

కాగా రజినీ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న రోబో 2.0 షూటింగ్ లో బిజీగా ఉన్నారని సమాచారం. అందువల్లే ఆయన తెలుగు కబాలి ఆడియో ఫంక్షన్ లో పాల్గొనలేదని తెలిసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *