కబాలీ.. విడుదలకు ముందే లీక్..

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతిష్టాత్మకంగా తీసిన కబాలి చిత్రం లీక్ అయ్యింది. ఎవరో కొందరు దీన్ని పైరసీ చేసి టోరెంట్స్ సైట్లలో పెట్టేశారు. ఈ సినిమా ఇప్పటికే దేశవిదేశాల్లో విడుదలకు సిద్ధమవుతోంది. శుక్రవారం విడుదల కానున్న ఈ మూవీకి విడుదలకు ముందే కొందరు పైరసీ చేసేశారు. టోరెంట్ వెబ్ సైట్లలో విడుదల చేశారు. దీనిపై దర్శకుడు రంజిత్ కోర్టు, పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ జరిపిస్తున్నారు.

కాగా కబాలి కోసం దేశవిదేశాల్లో వేల థియేటర్లలో ప్రదర్శన కు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీతో పాటు జర్మన్, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తున్నారు. ముఖ్యగా మలేషియా, సింగపూర్, లలో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ప్లాన్ చేశారట.. ఈ సినిమా మొత్తం మలేషియా నేపథ్యంలోనే సాగుతుండడంతో అక్కడా ఈ సినిమాకు ఫ్యాన్స్ పెరిగిపోయారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *