తీర్పునిచ్చేవాళ్లే రోడ్డెక్కడం.. దేశంలో తొలిసారట..

telangana-judges-protest_650x400_51466967828

చట్టం, న్యాయం ఈ రెండు ప్రజాస్వామ్య వ్యవస్థకు రెండు కళ్లలాంటివి.. ఎవ్వరైనా క్రమశిక్షణ తప్పుతారు కానీ ఈ రెండు వ్యవస్థలైన పోలీస్, న్యాయ వ్యవస్థలు ఎప్పుడు అదుపులో ఉంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తారు. ప్రపంచంలోనే వీరు రొడ్డెక్కడం ఆందోళన చేయడం చాలా అరుదైన విషయం. ఇప్పటివరకు ఎక్కడా అలాంటిది జరగలేదట.. కానీ తెలంగాణలో అది జరిగింది. న్యాయాధికారులు, జిల్లా, రాష్ట్ర, సబ్ కోర్టుల జడ్జీలందరూ తమ హక్కుల సాధనకు రోడ్డెక్కారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జడ్జీలందరూ రాజీనామాలు చేశారు. వారం లోపు సమస్యలు పరిష్కరించకుంటే రాజీనామాలు ఆమోదించుకుంటామని హెచ్చరించారు. దీంతో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి దిలీప్  బోంస్లే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జడ్జీల సమస్యలపై సమాలోచనలు జరిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జడ్జీల నియామకాలను తెలంగాణ జడ్జీలు వ్యతిరేకిస్తున్నారు.  ఈ ఎంపిక జాబితాలో అందరూ ఆంధ్రా జడ్జీలే ఉన్నారని.. దీని వల్ల తెలంగాణలో తమకు అన్యాయం జరుగుతుందని.. ప్రమోషన్లలో వెనుకబడిపోతామని ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో గన్ పార్క్ నుంచి గవర్నర్ నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. గవర్నర్ కు వినతిపత్రం అందించారు. సమస్య పరిష్కారం కాకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. దీంతో చరిత్రలోనే తొలిసారి ఎంతో క్రమశిక్షణ పాటించే జడ్జీలే రోడ్డెక్కడం తీవ్ర కలకలం రేపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *