Breaking News

ఇది ప్రభుత్వంపై జర్నలిస్టుల యుద్ధమే..

00tuwj

దాదాపు రెండున్నరేళ్లు.. జర్నలిస్టుల చావులు, బాధలు, సౌకర్యాలు లేక పడుతున్న అవస్థలకు రెండున్నరేళ్లవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులు 900 కడితే వారికి ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇచ్చింది. వాటితో రోగాల బారిన పడిన జర్నలిస్టులు చికిత్సలు చేయించుకునేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హెల్త్ కార్డులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదు. కనీసం జర్నలిస్టులకు హెల్త్ కార్డుు, అక్రిడిటేషన్లు కూడా ఇవ్వలేదు.. ఇప్పటికీ అక్రిడిటేషన్లు ఆంధ్రా ప్రభుత్వం ఇచ్చినవే ఉన్నాయి. వాటిని ప్రభుత్వం పొడిగిస్తూ వస్తోంది. అంత దుర్భరంగా జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం..

సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ని నెరవేర్చలేదు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వలేదు. హెల్త్ కార్డులపై ప్రకటనలే కాని ఇప్పటివరకు ఇచ్చింది లేదు.. ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయాన్ని అసలు కేసీఆర్ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ఎన్నికలకు ముందు స్వయంగా మేనిఫెస్టోలో పెట్టినా.. హామీ ఇచ్చినా కూడా జర్నలిస్టుల హామీలు ఇప్పటికీ ఎండమావిలానే కనిపిస్తున్నాయి. అందుకే ఇక జర్నలిస్టుల్లో ఓపిక నశించింది.. వారు పోరుబాట పట్టారు..
ఈ నెల 22న టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హాలో జర్నలిస్ట్స్ చలో కలెక్టరేట్ ను తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిర్వహిస్తున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ యుద్దంలో అందరూ పాల్గొనాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రబుత్వం కళ్లు తెరిచి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ప్రతి జర్నలిస్టు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *