
మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ , ఎమ్మెల్యే గంగుల, మేయర్ రవీందర్ సింగ్ లు ఈరోజు కరీంనగర్ లోని ప్రతిమ హోటల్ లో జర్నలిస్టులతో సమావేశమయ్యారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని పాత్రికేయులు కోరారు.
మంత్రి ఈటెల, వినోద్ లు మాట్లాడుతూ ప్రభుత్వం, కేసీఆర్ దృష్టికి జర్నలిస్టుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు..
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే కరీంనగర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాడూరి కరుణాకర్, శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ అయిలు రమేశ్, వందలాది మంది జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.