Breaking News

జర్నలిస్టుల దరువు.. ప్రభుత్వానికి బెదురు..

ailu445

జర్నలిస్టులు డప్పు పట్టి దరువేశారు. కేవలం తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే డప్పు చపుళ్ల నిరసన ఉండేది. కానీ ఇప్పుడు మరోసారి సమస్యల సాధనకు ఉద్యమ జర్నలిస్టులు రోడ్డెక్కారు. అక్కడే ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని డప్పు పట్టి దరువేశారు. ప్రభుత్వానికి వినపడేలా దరువు చప్పుళ్లు మోతమోగాయి..  కరీంనగర్ లోని కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, వంటావార్పు చలో కలెక్టరేట్ జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు తాడూరి కరుణాకర్ డప్పు చేతబట్టి దరువు వేసి నిరసన తెలిపారు.

ailu4456

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అద్యక్షులు తాడూరి కరుణాకార్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ టోమ్జా రాష్ట్ర అద్యక్షులు అయిలు రమేశ్ , జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిట్లల రాజేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, సురేంద్రకుమార్, లాయక్ పాషా, కే. భద్రాచలం, ప్రభుదాసు, విజయేందర్ రెడ్డి, వంశీ, జగన్మోహన్, కొండా లక్ష్మన్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, వందలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
కాగా ఈ ధర్నాలో ప్రజాప్రతినిధులు చాడ వెంకట్ రెడ్డి, కటకం మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, విజయరమణరావు, బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ జాతీయ నాయకుడు సుగుణాకర్ రావు, గందె మాధవి, సుజాతరెడ్డి, ఆకుల ప్రకాష్, సుదర్శన్, కొరివి వేణుగోపాల్, పీవీ సూర్యం, పాల్గొని ప్రసంగిస్తూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *