జర్నలిస్టుల అక్రిడిటేషన్లపై మార్గదర్శకలివే..

జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2016 పేరుతో ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని రూపొందించడానికి ప్రభుత్వం గతంలో సీనియర్ సంపాదకులు కే రామచంద్రమూర్తి సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన ఈ కమిటీ పలు దఫాలు సమావేశమై మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మార్గదర్శకాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసింది. దీంతో ప్రభుత్వం తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2016 పేరిట జీవో జారీచేసింది.

మార్గదర్శకాలు ఇవి..: ఆయా పత్రికల ఎడిటర్లు చేసే సిఫారసుల ప్రకారం ఎడిటర్, బ్యూరో చీఫ్, కరస్పాండెంట్, డెస్క్ జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్, కార్టూనిస్టు, స్పోర్ట్స్ కరస్పాండెంట్, ఫిల్మ్ కరస్పాండెంట్, పీరియాడికల్స్, న్యూస్ ఏజెన్సీల్లో పనిచేసే జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇస్తారు. వీటిలో మహిళా జర్నలిస్టులకు 33శాతం రిజర్వేషన్ కల్పించారు.

కేటాయింపు ఇలా..: దినపత్రికల్లో పనిచేసే కరస్పాండెంట్‌లకు కమిటీ ఎంత సంఖ్యలో అక్రెడిటేషన్లను సిఫారసు చేస్తుందో, అంతే నిష్పత్తిలో డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే విధంగా మార్గదర్శకాలను రూపొందించారు. ఉదాహరణకు ఒక దినపత్రికలో 20మంది కరస్పాండెంట్లకు అక్రెడిటేషన్లు ఇచ్చినట్లయితే అంతే నిష్పత్తిలో 20 మంది డెస్క్ జర్నలిస్టులకు ఇస్తారు. ఎడిటర్లు చేసే సిఫారసుల ప్రకారం నియోజకవర్గంలో, మండలంలో పనిచేసే జర్నలిస్టులకు కేటాయిస్తారు. తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులకు ఎక్కువ సంఖ్యలో వీటిని జారీ చేస్తారు. జిల్లా ఎడిషన్ సెంటర్‌లలో పనిచేసే డెస్క్ జర్నలిస్టులకు, ఫొటోగ్రాఫర్లకు అక్రెడిటేషన్లు ఇవ్వనున్నారు. జిల్లాలలో ప్రతీ ఎడిషన్ సెంటర్‌లో ఐదుగురు డెస్క్ జర్నలిస్టులకు వీటిని ఇస్తారు. అదేవిధంగా కార్టూనిస్టులు, ఫిల్మ్ జర్నలిస్టుల విషయంలో కూడా స్పష్టంగా మార్గదర్శకాలు పొందుపరిచారు. రాష్ట్రస్థాయి అక్రిడేషన్ కమిటీకి రాష్ట్ర ప్రెస్‌అకాడమీ చైర్మన్ లేదా సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. 25 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసిన జర్నలిస్టులకు ఇండిపెండెంట్ జర్నలిస్టు అక్రెడిటేషన్ కార్డును జారీ చేస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *