Breaking News

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సిందే..

dhrana11

తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు రోడ్డెక్కారు. తెలంగాణ ప్రభుత్వం రెండున్నరేళ్లు పరిష్కరించకుండా ఉన్న అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

dharna
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు కదంతొక్కారు.. ఈ ధర్నాలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం జర్నలిస్టుల ధర్నా కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిస్కరించాలని.. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాడూరి కరుణాకర్, గాండ్ల శ్రీనివాస్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్ , భారీగా జర్నలిస్టులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *