
రిలయన్స్ జియో మరో భారీ ఆఫర్ ను ప్రకటించింది. అధినేత ముఖేష్ అంబానీ ఇప్పటికే మూడు నెలల పాటు కాల్స్, ఇంటర్నెడ్ 4జీలో ఫ్రీ ఇచ్చి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రిలయన్స్ మరో సంచలనానికి తెరతీసింది..
ఇంటర్నెట్ సేవలను మరింత చౌకగా అందించేందుకు రిలయన్స్ సిద్ధమైంది. కేబుల్ ద్వారా అందించే బ్రాడ్ బండ్ ఇంటర్నెట్ ను కేవలం 500 రూపాయలకే 600 జీబీ ఫ్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇప్పుడు ప్రైవేటు కేబుల్ బ్రాడ్ బాండ్ లో 600 రూపాయలతో రిచార్జ్ చేసుకుంటే కేవలం 30 జీబీ మాత్రమే అందిస్తున్నాయి. అదే రిలయన్స్ జియో ఏకంగా 600 జీబీ ఇవ్వచూపడంతో అందరూ దీనికి మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది..