Breaking News

జానా ఉత్తమ్ లకు బస్తీమే సవాల్

kcr_land

కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభాపక్ష నేతగా జానారెడ్డిలపై నిప్పులు చెరిగారు కేసీఆర్.. తుమ్మడిహెట్టిని 152 మీటర్లనుంచి 148 మీటర్లకు కుదించడంపై జానా, ఉత్తమ్ లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై కేసీఆర్ మహారాష్ట్ర నుంచి రాగానే హైదరాబాద్ ర్యాలీలో మండిపడ్డారు.  అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర తో లొల్లి పెట్టుకొని ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మేము కడుతుంటే అడ్డుపడుతున్నారని.. ఎత్తు సమస్య కాదని.. తెలంగాణ ప్రజలకు నీళ్లే ముఖ్యమని తెలిపారు. కోటి ఎకరాలకు తెలంగాణలో నీళ్లు ఇచ్చే వరకు విశ్రమించేది లేదని తెలిపారు.

ఒకవేళ కాంగ్రెస్ నాయకులు 152 మీటర్లు ఒప్పందం చేసుకుంటే తనకు చూపించాలని తాను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేసీఆర్ సవాల్ విసిరారు.  ఆరోపణలు రుజువు చేయకపోతే జైలుకెళతారా జాగ్రత్త అని కేసీఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *