ఓరుగల్లు స్టామినా చూపించారు..

వరంగల్ ఉద్యమాలకు పుట్టినల్లు.. అక్కడ ఏ ఉద్యమమైనా పురుడు పోసుకుంటే అంత తేలికగా వెనక్కిపోదున.. ఇప్పుడు ఓరుగల్లు జిల్లాను అదే కుదిపేస్తోంది.. వరంగల్ జిల్లా జనగామలో తమకు జిల్లా కావాలని చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. ఆర్టీసీ బస్సు దహనమైంది. వాహనాలు ధ్వంసమయ్యాయి. జిల్లా సాధన సమితి ఐకాస జనగామ బంద్ కు పిలుపునిచ్చింది. ఆందోళనకారులు రోడ్డు మీదకు వచ్చి నానా బీభత్సం చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి హైదరాబాద్-హన్మకొండ, సిద్దిపేట-సూర్యపేట రహదారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు..

కాగా మహబూబ్ నగర్ జిల్లాలో సైతం గద్వాల జిల్లా కోసం ఎమ్మెల్యే డీకే అరుణ, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళనకు దిగారు. రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *