
కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జైరాం రమేశ్ తెలంగాణ విభజనపై రచించిన ఓ పుస్తకాన్ని నిన్న హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ విభజిస్తే కాంగ్రెస్ నుంచి దూరమైన రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ గూటికి వచ్చి తెలంగాణ సీఎంగా రెడ్డిలే అవుతారని భావించామని కానీ రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యామని’ జైరాంరెడ్డి సంచలన మాటలు మాట్లాడారు. 2009లో జగన్ వైసీపీ పెట్టాక రెడ్డీలందరూ వైసీపీ గూటికి చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని తెలిసి భయపడింది. అనంతరం కేసీఆర్ ఉద్యమంలోకి దిగాడు. ఈ నేపథ్యంలోనే రెడ్డిలను కాపాడుకోవడం.. కాంగ్రెస్ గెలిస్తే రెడ్డీలను సీఎం చేయవచ్చనే వ్యూహంతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని స్పష్టం చేశారు.
కానీ సీన్ రివర్స్ అయ్యింది. తెలంగాణ ఇచ్చాక తెలంగాణ జనం కాంగ్రెస్ కంటే తెచ్చిన కేసీఆర్ నే ఎన్నుకుంది. ఏపీలో రెడ్డి అయిన వైసీపీకి కాకుండా కమ్మ అయిన చంద్రబాబును ఎన్నుకుంది. దీంతో కాంగ్రెస్ అటు ఆశించిన తెలంగాణలో.. ఆశలు లేని ఆంధ్రాలో కూడా రెడ్డి సామాజికవర్గం నిరాదరణకు గురైంది. రెడ్డి వర్గం వారు సీఎంగా, వారి పార్టీలు అధికారంలోకి రాలేదు. తెలంగాణలో వెలమ సామాజికవర్గ కేసీఆర్, ఆంధ్రా లో కమ్మ నేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దీంతో జైరాం అన్నట్టు తెలంగాణ విభజనతో రెడ్డిలకు మేలు జరుగుతుందని భావించామని వాపోయడంలో మీనింగ్ ఇది అని అర్థమవుతోంది.