మంత్రి పదవి ఇచ్చుంటే తెలంగాణ వచ్చేది కాదట..

ramesh

ఏపీ విభజన-రాజకీయాలపై ‘ఓల్డ్ హిస్టరీ..న్యూ జాగ్రఫీ.. బైఫర్ కేటింగ్’ అనే పుస్తకాన్ని వెలువరించారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్.. ఏపీ విభజన కమిటీ కీరోల్ పోషించిన జైరాం రమేశ్.. అప్పటి రాష్ట్ర విభజన తాలూకూ ప్రతి సందర్భాన్ని పుస్తకంలో వివరించారు. ఈ సందర్భంగా జైరాం రమేశ్ అందులో కొన్ని కీలక విషయాలు ఊటంకించారు.

తెలంగాణ ఏర్పాటుకు చంద్రబాబే కారణమని చెప్పారు. అసలు చంద్రబాబు.. కేసీఆర్ కు నాడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆయన టీడీపీలోనే కొనసాగి.. నేడు తెలంగాణ ఏర్పాటు అయ్యేది కాదన్నారు. వైఎస్ చనిపోక పోయినా తెలంగాణ ఏర్పాటు అయ్యేది కాదని.. వైఎస్ మరణంతోనే ఏపీ, తెలంగాణల్లో కాంగ్రెస్ కనుమరుగైందని జైరాం పుస్తకంలో వివరించారు.

ఏపీని విభజించి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుందని.. రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి అవస్థలు పడుతోందని జైరాం పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నాడు సీపీఐ తప్ప అందరూ ఒప్పుకున్నారని.. అందుకే రాష్ట్రాన్ని విభజించారని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *