
ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష జగన్ ల సోషల్ మీడియా యుద్ధం భలే రంజుగా సాగుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వైసీపీ అధినేత జగన్ అక్కడ గోల్ఫ్ ఆడుతూ, చెస్ ఆడుతూ సేదతీరుతున్నారు. ఈ సందర్భంగా పలువురు జగన్ ఆడిన ఆటల ఫొటోలను తమకు నచ్చిన కామెంట్లతో ప్రత్యర్థులపై విసురుతూ తెగ పండగ చేసుకుంటున్నారు..
జగన్ గోల్ప్ ఆడే బంతిగా చంద్రబాబును చూపిస్తూ సెటైర్ వేస్తున్నారు. చంద్రబాబు యోగానాడు జగన్ నామస్మరణతో భయపడుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు. ఇక చంద్రబాబు టీం తక్కువేం తినలేదు. ఏపీలో రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణను విడగొట్టిన జగన్.. ఇప్పుడు బ్రిటన్ పర్యటనకు వెళ్లి ఆ దేశాన్ని యూరోపియన్ యూనియన్ నుంచి విడగొట్టాడని పంచులు పేలుస్తున్నారు. జగన్ విభజన వాది అని ఆయన ఎక్కడ అడుగుపెడితే వారు విడిపోతారని సెటైర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..