Breaking News

గ్రానైట్ మాఫియా ఆగడాలు ఇవీ..

122245

కరీంనగర్ ను గ్రానైట్ మాఫియా కొల్లగొడుతోంది. నిబంధనలకు నీళ్లొదిలి పెద్ద ఎత్తున గ్రానైట్ రాయిని కెపాసిటికి మించి తరలిస్తోంది. దీంతో లారీలు ఆ బండ రాయిలను మోయలేక రోడ్డుపై పడిన సంఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. కరీంనగరంలోని సుభాష్ నగర్ చౌరస్తాలో గ్రానైట్ లారీ రాయిని తరలిస్తుండగా ఒక్కసారిగా బరువు ఎక్కువై కూలిపోయింది. రాయి బరువు ఎక్కువై టైర్లు ఊడిపోయి కిందపడిపోయింది. ప్రయాణికులు అక్కడ ఉండి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.. కరీంనగర్ జిల్లాలో ఈ మాఫియా కు అడుగడుగునా ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలున్నాయి. అందుకే ఎన్ని ఘటనలు జరుగుతున్నా.. ఎంత నిబంధనలకు నీళ్లొదిలి గ్రానైట్ ను తీసుకెళ్తున్న కూడా వారిని ఎవ్వరూ పట్టుకోవడం లేదు. గ్రానైట్ మాఫియాకు అధికార పార్టీ నాయకులతో లింకులున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో వీరి ఆగడాలకు అడ్డుకట్టపడడం లేదు.

555645

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *