8000 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

ఉపాధ్యాయ వృత్తి ని కోరుకునే అభ్యర్థులకు శుభవార్త..దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో సుమారు 8000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ. దేశవ్యాప్తంగా 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లలో ఈ ఉపాధ్యాయ పోస్ట్ లు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాదు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో అర్హత సాధించలేకపోయినవారు కూడా ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు అని తెలిపింది.

అర్హతలు:

* పీజీటీ – సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఎడ్ ఉత్తీర్ణత.
* టీజీటీ – డిగ్రీ, బీఎడ్ ఉత్తీర్ణత
* పీఆర్‌టీ – డిగ్రీ, బీఎడ్ ఉత్తీర్ణత

వీటితో పాటు పీజీ/డిగ్రీ, బీఎడ్‌ల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

పీజీటీ పోస్టులకు వస్తే ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మాటిక్స్, హోం సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి.

అలాగే టీజీటీ పోస్టులు వస్తే ఇంగ్లిష్, హిందీ, సంసృ్కతం, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి.

వయస్సు:

2016, ఏప్రిల్ 1 నాటికి ఫ్రెషర్స్‌కు అయితే 40 ఏళ్ళు . అనుభవం కలిగిన అభ్యర్థులకు 57 ఏళ్లకు మించరాదు.

HTTP://WWW.APS-CSB.IN/COLLEGE ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు: రూ. 600/-,
చివరితేదీ: సెప్టెంబర్ 13
పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్ , విజయవాడ (దగ్గర్లోని పరీక్ష కేంద్రాలు. దేశవ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి)
మరింత సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *