హైదరాబాద్ లో పేలుళ్లకు భారీ కుట్ర

ISIS-suspects

ఐసిస్ ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నారు. ఇటీవల అరెస్ట్ అయిన నిక్కీ జోసఫ్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా.. ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఇందులో పలువురు ఉగ్రవాదులు హైదరాబాద్ లో మకాం వేసి దేశవ్యాప్తంగా ముందుగా హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలిసింది..
దీంతో ఈ ఉదయాన్నే హైదరాబాద్ వచ్చిన ఎన్ఐఏ అధికారులు తెలంగాణ పోలీసుల సహాయంతో హైదరాబాద్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మీర్ చౌక్, మొగల్ పుర, భవానీ నగర్, చాంద్రాయణ గుట్ట, పరిసరప్రాంతాల్లో గాలించి దాదాపు 13 మంది ఐసిస్ సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ ఐసిస్ ఉగ్రవాదుల, లేక ఇండియన్ ముజాహిదిన్ స్లీపర్ సెల్స్ ఉగ్రవాదుల అన్న విషయాలను ఆరాతీస్తున్నారు. వీరివద్దనుంచి భారీగా ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.. దీంతో హైదరాబాద్ లో మరో భారీ పేలుళ్ల కుట్ర రట్టైయినట్టు తెలిసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *