టర్కీపై ఐసిస్ దాడి..

3014679800000578-3395311-image-m-53_1452599299436

సిరియా సంక్షోభం దాని పక్కనే ఉన్న దేశం టర్కీపై పడింది. ఐసిస్ ఉగ్రవాదులు టర్కీ దేశ రాజధాని నగరమైన ఇస్తాంబుల్ విమానాశ్రయంపై దాడి చేశారు. పలువురు మానవబాంబుల ఆత్మాహుతి ఐసిస్ ఉగ్రవాదులు ఇస్తాంబు ల్ విమానశ్రయం లోకి చొరబడి తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో ఈ ఘటనలో దాదాపు 50మంది ప్రయాణికులు చనిపోయారని తెలిసింది. చాలామంది గాయపడితే ఆస్పత్రికి తరలించారు. వార్త తెలియగానే టర్కీ సైన్యం విమానాశ్రయాన్ని చుట్టుమట్టి తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

కాగా సిరియా లో ఐసిస్ రాజ్యం నడుస్తోంది. ఉగ్రమూకలు పక్కనే ఉన్న టర్కీలోకి చొరబడి ఇలా దాడులు చేశారని తెలిసింది. ఇప్పటికే సిరియా నుంచి చాలామంది శరణార్థులు టర్కీలోకి చేరుకున్నారు. ఇప్పుడు ఇలా వచ్చిన వారిలో కొందరు ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *