
హైదరాబాద్ : హైదరాబాద్ ఉప్పల్ సొంత గడ్డపై హైదరాబాద్ సన్ రైజర్స్ .. పటిష్టమైన చైన్నైను మట్టికరిపించింది. తొలుత డేవిడ్ వార్నర్ ధాటికి (28 బంతుల్లో 61) పరుగుల సునామీతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన చైన్నైను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. చైన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులే చేసి ఓడిపోయింది.
మరో మ్యాచ్ కోల్ కతా, బెంగళూరు ల మధ్య మొదట వర్షం వల్ల అంతరాయం కలిగింది. 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో కోల్ కతా మొదట 10 ఓవర్లలో 111 చేయగా.. ఆ తర్వాత బెంగళూరు 9.4 ఓవర్లలో 3 వికెట్లకు 115 పరుగుల చేసి విజయం సాధించింది.