రూ.1000నోట్లను రోడ్డుపై విసేరాశారు..

crispy_notes_for_toll

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో వింత చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో యాత్రికుల సందడి నడుమ ఓ వ్యక్తి వెయ్యి రూపాయల నోట్లను రోడ్డుపైకి విసిరేశాడు. ఆ సమయంలో అక్కడున్న యాత్రికులు ఈ నోట్ల కోసం ఎగబడ్డారు. ద్వారక తిరుమల నుంచి భీమడోలు వెళుతున్న కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ. లక్షకు పైగా విలువైన వెయ్యి రూపాయల నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వెళ్లిపోయాడు.
కాగా కేంద్రం, మోడీ ప్రభుత్వం రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేయడంతో బ్లాక్ మనీ దాచుకున్న నల్ల కుబేరుల్లో వణుకు మొదలైంది. కొద్దిరోజులైతే అవి చెల్లవు కావడంతో మార్చుకోవడానికి జంకుతున్నారు. ఐటీ దాడులు, బ్లాక్ మనీ మార్చుకోవడానికి ఆస్కారం లేకపోవడం తో ఇలా డబ్బులు విసిరేసినట్టు తెలుస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *