కేటీఆర్ పిలుపునకు స్పందించిన గంగుల

తెలంగాణ రాష్ట్ర ఐటి & మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు గారు పిలుపునిచ్చారు.. జనవరి ఒకటి నుండి ప్లాస్టిక్ తో తయారు చేయబడుతున్న ఫ్లెక్సీలను బ్యాన్ చేయలని కోరారు. ఈ పిలుపునకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల వేగంగా స్పందించారు.  నేడు కరీంనగర్ నియోజక వర్గం మీ సేవా కార్యాలయం ముందు నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలను శాసన సభ్యులు గంగుల కమలాకర్ గారు స్వచ్చందంగా తీసేయించారు..

ఈ సందర్బంగా శాసన సభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయన్ని తూచా తప్పకుండ పాటించాలని , ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి గొప్ప నిర్ణయాలను మనమందరం కచ్చితంగా పాటించి ప్లాస్టిక్ రహిత తెలంగాణ నిర్మాణం లో భాగస్వాములు కావాలని , నగర ప్రజలంతా సహకరించాలని గంగుల కమలాకర్ విఙప్తి చేశారు..

నగర అందాలను చెడగొట్టె ఇష్టా రాజ్యంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సిలు ,కటౌట్లు గోడ రాతలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని GHMC ,నుండి నగర పంచాయితిల వరకు ఫ్లెక్సిల నిషేధాన్ని అమలు చేయాలని ఆదేశిస్తూ జీ.వొ విడుదల చేసిందని ,త్వరలో జరిమానాలు కూడా పెద్ద మొత్తంలో ఉదృతంగా వుంటాయని అని ఒక ప్రకటనలో తెలియ చేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *