IJU 8వ ప్లీనరీ ముగింపు సమావేశానికి ఒడిషా గవర్నర్

jameer 1

భువనేశ్వర్ (ఒడిశా): ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 8వ ప్లీనరీ మహాసభలు ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోని కే హెచ్ టీ క్యాంపస్ లో ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్లీనరీ సమావేశాలను కేంద్రం కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభిస్తారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఐజేయూ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా అధ్యక్షత వహిస్తారు.

ఈ ప్లీనరీ ముగింపు సమావేశానికి ఒడిశా గవర్నర్ డా. ఎస్ సీ జమీర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. ఒడిషా మంత్రి పుష్పేంద్రసింగ్ తో పాటు ఎమ్మెల్యే ప్రియదర్శిని మిశ్రా పాల్గొంటారు. ఈ ప్లీనరీ సమావేశాలకు ముందు మే 22న ఐజేయూ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ వేతన సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు.

ఒడిశా జర్నలిస్ట్ యూనియన్ ఆతిథ్యమిస్తున్న ఈ ప్లీనరీ సమావేశాలలో దేశంలోని ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాలయ(ఉత్తర), జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, ఢిల్లీ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్ , చండీఘడ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, త్రిపుర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ తెలిపారు. యూనియన్ నాయకులు కే.శ్రీనివాస రెడ్డి, సఖీనా ఇంద్రజిత్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్ నాథ్ తదితరులు పాల్గొంటారని అమర్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *