IJU 8వ ప్లీనరీలో కరీంనగర్ జర్నలిస్టుల

000000iju

ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో జరుగుతున్న ఐజేయూ 8వ ప్లీనరీలో కరీంనగర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఐజేయూ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా అధ్యక్షత వహించారు.కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ ప్రసంగించారు. వేదికపై , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్ నాథ్ తదితర ముఖ్య అతిథులు కూర్చున్నారు. ఈ మహాసభలు 23 నుంచి 25 వరకు భువనేశ్వర్ లో కొనసాగుతాయి.

ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ కే.శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, నాయకులు  రవీందర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు అయిలు రమేశ్ తదితరులు భువనేశ్వర్ వెళ్లారు. సమావేశాలు జరిగే మూడు రోజులు వీరు పాల్గొని అనంతరం కార్యవర్గ సమావేశంలో సమస్యలపై తీర్మానాలు చేస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *