
ఇంటర్నెట్ ఇప్పటివరకు వాడని అందరు వినియోగదారులను ఇంటర్నెట్ కు పరిచయం చేసేందుకు వీలుగా ఐడియా కొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఐడియా ప్రీపైడ్,రిటైలర్లకు నెలకు 100 ఎంబీ ఉచిత డేటాను అందించనున్నట్టు ఐడియా ప్రకటించింది.
దీని వల్ల ఇంతవరకు ఇంటర్నెట్ వాడని వారు సైతం యాక్సస్ చేసి ఐడియా ఇంటర్నెట్ లో విహరిస్తారని.. అందరికీ ఇంటర్నెట్ అందుబాటు లోకి తేవడానికి ఈ ఆఫర్ అద్వితీయంగా పనిచేస్తుందని ఐడియా తెలిపింది.