
హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా ఎంపికైంది.. అంటే మెరుగైన నివాసం ఉండే నగరం .. మెర్సర్ గ్లోబరల్ హ్యూమన్ రిసోర్సెస్ అనే కన్సల్టెన్సీ చేసిన సర్వేలో 2016 సంవత్సరానికి దేశంలోనే జీవించడానికి అత్తుత్తమ నగరం హైదరాబాద్ అని తేలింది.. హైదరాబాద్ మొదటిస్థానంలో నిలవగా.. ముంబై, ఢిల్లీ, చైన్నై, బెంగళూరు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, సాంస్కృతిక, వైద్యం, విద్య, ప్రజారవాణా, వినోదం ఇలా పలు అంశాలపై దేశంలోని 230 పట్టణాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ 139 స్థానంలో ఉండగా.. దేశంలో మొదటిస్థానంలో నిలిచింది..హైదరాబాద్ లో అద్దెలు కూడా చాలా తక్కువని తేలింది. దీంతో మన భాగ్యనగరం మరో ఘనతను సొంతం చేసుకుంది.