డ్రగ్గిస్ట్ లకు హైదరాబాదే ఆవాసం..

భవిష్యత్తులో డ్రగ్గిస్ట్ లకు హైదరాబాదే ఆవాసం కానుంది. ఎందుకుంటే ఇప్పటికే తెలంగాణలో ముఖ్యం గా హైదరాబాద్ పరిసరాల్లో రెడ్డీస్ ల్యాబ్స్, అరబిందో, హెటిరో లాంటి తెలుగు వారి సారథ్యంలోని డ్రగ్ పరిశ్రమలతో పాటు దేశ, విదేశీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వెలిశాయి. దీనికి తోడు నిన్న కేంద్రప్రభుత్వం తెలంగాణకు రెండు ప్రతిష్టాత్మక ఔషధ సంస్థలను మంజూరుచేసింది. ఒక్కోదానికి 100కోట్ల చొప్పున మంజూరుచేసింది. దీని వల్ల మరింత పెద్ద ఎత్తున ఔషధ పరిశ్రమ తెలంగాణలో వేళ్లూనుకునే అవకాశం ఏర్పడింది.

ఇప్పటికే తెలంగాణలో దాదాపు 200 డ్రగ్ పరిశ్రమలు, 400 ఫార్ములా సంస్థలున్నాయి.  ఈ రంగానికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఔషధ నియంత్రణ అకాడమీ, జాతీయ ఫార్మకోపియా కమిషన్ ప్రాంతీయ కార్యాలయాలను ప్రకటించింది . దీనివల్ల మరికొన్ని ఔషధ పరిశ్రమలతో పాటు, ఔషధ పరిశోధనలు ఎక్కువై డ్రగ్స్ సబ్జెక్టు లు చదివిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయో టెక్నాలజీ లాంటి తదితర సబ్జెక్టులు చదివిన వారికి ఉపాధి లభిస్తుంది. భారీ జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *