షేర్ మార్కెట్ ముంచింది.. భార్యను ముక్కలు చేశాడు..

ఈ ప్రపంచంలో డబ్బు ఏపైనైనా చేస్తుంది. డబ్బు డబ్బు నువ్ ఏం చేశావని అడిగితే.. ఏమైనా చేయగలను అంటుందట.. పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టొచ్చు.. అన్నాదమ్ముళ్లను విడదీయచ్చు.. రాజ్యాలను భస్మీపటలం చేయొచ్చు.. అంతెందుకు  రెండు దేశాలనే అతలాకుతలం చేయొచ్చని డబ్బు అనుకుంటుందట..

ఆ డబ్బు ఇద్దరు భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో భార్య లొల్లి పెట్టింది. షేర్ మార్కెట్ లో డబ్బును పెట్టి ముంచావ్ అని గొడవ చేసింది. చిర్రెత్తుకొచ్చిన భర్త ఆ భార్యను ముక్కలుగా కోసేశాడు.. అనంతరం బ్యాగులో హైదరాబాద్ లోని శంషాబాద్ దూర ప్రాంతంలో తగలబెడుతుండగా కొందరు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దరిద్రానికి కారు కూడా కూడా అప్పుడే మట్టిరోడ్డులో దిగబడిపోయి దొరికిపోయాడు భర్త..

హైదరాబాద్ గచ్చీబౌలిలో నివాసముండే రూపేశ్… ఆ మద్య ఆప్రికా దేశం కాంగో వెళ్లి సింతియా అనే ఆఫ్రికన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. షేర్ మార్కెట్ లో డబ్బులు నిండా మునిగాడు. దీనిపై భార్య లొల్లి చేయడంతో కోపంలో చంపేశాడు. అనంతరం భార్య శవాన్ని ముక్కలుగా కోసి పెట్రోల్ పోసి కాల్చేశాడు. ఇది చూసిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి పట్టుకున్నారు. కారు బురదలో దిగిపోవడంతో స్థానికులకు భర్త దొరికిపోయాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *