
సీఎం కేసీఆర్ తెలివి తేటలకు మెచ్చుకోవాల్సిందే.. ఆయన రాజకీయ దురంధురుడు అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.. ఇటీవ ల కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఇందులో గుత్తాకు తప్ప వివేక్, వినోద్, విజయభాస్కర్ సహా అందరికీ కండువాలు కప్పారు కేసీఆర్.. ఒక్క గుత్తాకు కప్పలేదు. దీనిపై రకరకాలు ఊహాగానాలు వెలువడ్డా గానీ రహస్యం అంతుచిక్కలేదు.. కానీ ఇప్పుడు బయటపడింది..
కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే అనర్హత పడుతుందని కేసీఆరే గుత్తాకు కండువా కప్పలేదు. కేంద్రంలోని పార్లమెంటు స్పీకర్ సుమిత్రా మహాస్టిక్ట్ మనిషి. కాంగ్రెస్ నేతలు గుత్తా కండువా కప్పుకున్న పేపర్ కటింగ్స్, వీడియోలు ఇస్తే సుమిత్ర అనర్హత వేటు వేయడం ఖాయం. అందుకే కేసీఆర్ ఢిల్లీలో మేనేజ్ చేయడం కష్టమని రాష్ట్ర నేతలకు కండువా కప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి కౌగిలించుకొని పార్టీలోకి ఆహ్వానించారు. అంటే ఇప్పుడే అనర్హత పడి మళ్లీ ఎన్నికలకు వెళ్లడం ఇష్టం లేక కేసీఆర్ ఈ ఐడియా వేశారన్న మాట.. అందీ సంగతి..