ఢిల్లీలో తెలంగాణ లొల్లి

ఢిల్లీ గల్లీల్లో మరోసారి తెలంగాణ ఉద్యమ వేడి రాజుకుంది. తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు.. తెలంగాణ లో జడ్జీల నియామకాల్లో తెలంగాణ జడ్జీలకు జరుగుతున్న వారు ఢిల్లీ వేదికగా ధర్నా చేయాలని నిర్ణయించారు. తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం వల్ల హైకోర్టు ఉద్యోగాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని ఇప్పటికే న్యాయవాదులు , జడ్జీలు ఆందోళన చేశారు. హైకోర్టు సస్పెన్షన్ విధించింది. కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు నిరసన సెగ తగిలినా ఇప్పటివరకు ఎవ్వరూ స్పందించలేదు. హైకోర్టుపై ముందడుగు పడలేదు. దీంతో తెలంగాణ న్యాయవాదులు ఢిల్లీ వేదిక గా కేంద్రం తీరును ఎండగట్టాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు.

న్యాయవాదుల ధర్నా కోసం ఇప్పటికే తెలంగాణ లోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 1000 మంది న్యాయవాదులు ఢిల్లీకి తరలివచ్చారు. వారందరూ నేడు ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో తెలంగాణ ఎంపీలు పాల్గొననున్నారు. దీంతో మరో సారి హైకోర్టు విభజన వేడి ఢిల్లీకి తాకనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *