Breaking News

మానవత్వం పరిమళించింది.. చిగురుమామిడి వాట్సాప్ గ్రూప్ సభ్యుల వితరణ

1111

మానవత్వం పరిమళించింది.. ఆపదలో ఉన్న అభాగ్యుడికి ఆసరా దక్కింది. చిగురుమామాడి మండలానికి చెందిన మనసున్న మారాజుల చైతన్యానికి ఓ అభాగ్యుడికి ఆర్థిక సాయం అందింది.

 ‘‘చిగురుమామిడి వార్త గ్రూపు’’లో ఉన్న చిగురుమామిడి మండలంలోని  ప్రతి ఒక్కరు కలిసి మండల కేంద్రంలో బోన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న కుంభం కుమారస్వామి అనే బాధితుడిని తలా కొంత మొత్తం విరాళాలుగా సేకరించి ఈరోజు అందించారు.

చిగురుమామిడి ఎస్.ఐ సత్యనారాయణ ఆధ్వర్వంలో వాట్సాప్ గ్రూప్ సభ్యులందరూ దాదాపు 35700 రూపాయలు సేకరించి ఈరోజు అందించారు.

ఈ సహాయం చేయడానికి ఒక్క గొప్ప వేదికగా వాట్సప్ గ్రూప్ ను అందించిన పత్తం రమేష్ వార్త రిపోర్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పొన్నం శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా ఈ యజ్ఞంలో సహకారం అందించిన వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పొన్నం శ్రీనివాస్ తెలిపారు.  భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమలను మనం అందరం కలిసి చేయాలని కోరుకుంటున్నట్టు పొన్నం శ్రీనివాస్ తెలిపారు.

 

బోన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న కుంభం కుమారస్వామికి ఆర్థిక సాయం చేస్తున్న సభ్యుల వీడియో పైన లింక్ లో చూడొచ్చు..

https://www.facebook.com/100008854188065/videos/1776185422686580/

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *