Breaking News

ఈ హెడ్మాస్టర్ త్యాగం వెలకట్టలేనిది..

students

నిజంగా ఇది కదిలించే అంశమే.. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే.. పిల్లల ప్రాణాలు పోతాయని తెలిసి వెరవకుండా ఈ ప్రధానోపాధ్యాయురాలు వారి ప్రాణాలు కాపాడి అసువులు బాసింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి త్యాగం వెలకట్టలేనిది..
రంగారెడ్డి జిల్లా పూడురు మండలం మెడికొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి ఆగస్టు 15 వేడుకల్లో భాగంగా విద్యార్థులతో జెండా పాతిస్తోంది. ఇంతలో జెండా కర్ర విద్యుత్ తీగలకు తగిలింది.కొద్దిగా షాక్ రావడంతో పిల్లలను కాపాడే ప్రయత్నంలో వారిని పక్కకు లాగి ప్రభావతి జెండా కర్రను పట్టుకుంది. షాక్ గురై అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయింది. అనంతరం ఉపాధ్యాయులు ప్రభావతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆ పిల్లల ప్రాణాలను కాపాడిన ఉపాధ్యాయురాలి త్యాగనిరతిని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఆమె ఆశ్రు నివాళి ఘటిస్తున్నారు. ప్రభావతికి భర్త ఇద్దరు కుమారులున్నారు.

Eal

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *