
తెలంగాణలో హరితహారం మహోద్యమంలా సాగింది. ఊరువాడా అందరూ మొక్కలు నాటారు. ఈ హరితహారంలో ముఖ్యం గా హైదరాబాద్ లో ప్రముఖులు పాల్గొని హరితహారంలో తాము భాగస్వాములయ్యారు. గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొని భెల్ లో మొక్కలు నాటారు. మంత్రి హరీష్, కేటీఆర్ లు పాల్గొన్నారు.
ఇక రామోజీ ఫిలిం సిటీలో సైతం హరితహారం కొనసాగింది. రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి రామోజీ రావు , ఈనాడు ఎండీ కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ రామ్మోహన్ రావులు రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఈనాడు , ఫిలింసిటీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక మా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హీరోలు రాజేంద్రప్రసాద్, రాజ్ తరుణ్, శ్రీకాంత్, తనిఖెళ్ల భరిణి, మేయర్ రామ్మోహన్, రెజీనా తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.
అలాగే ప్రస్తుతం బాహుబలి 2 తెరకెక్కిస్తున్న రాజమౌళి టీం మొత్తం హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. హీరో ప్రభాస్, రానా, రాజమౌళి, టీం మొత్తం కలిసి రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటారు.