Breaking News

ట్రబుల్ షూటర్ హరీష్ మాయ చేశాడు..

dgasdgag-8

మల్లన్నసాగర్ ముంపు బాధితుల ఆందోళనలతో పోయిన నెల అంతా నిరసనలు, ఆందోళనలు ధర్నాలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం సీఎం కేసీఆర్ కు కూడా తలనొప్పులు తెచ్చిపెట్టింది.. కానీ ఒకే ఒక్కడు హరీష్ రావు ఈ వివాదాన్ని చాకచక్యంగా పరిష్కరించారు. టీఆర్ఎస్ లో తనను ఎందుకు ట్రబుల్ షూటర్ అంటారో మరోసారి నిరూపించాడు..
మల్లన్న సాగర్ ముంపు బాధితులు ఆందోళనలు పరిష్కరించడంలో హరీష్ త్రిముఖ వ్యూహాలను అమలు చేశాడు. ఒకటి ప్రతిపక్షాలపై జనంలో అపనమ్మకాన్ని సృష్టించాడు. రెండో ప్రభుత్వంపై నమ్మకాన్ని పరిహారాన్ని బాగా పెంచాడు.., ప్రాజెక్టు కడితే ఉపయోగాలను వివరించాడు. దాదాపు143 కోట్ల రూపాయలను ఏకకాలంలో చెల్లించాడు. దీంతో ఒక్కో గ్రామం హరీష్ ను నమ్మి తమ భూములు, ఆస్తులు వదిలి సంతకాలు పెట్టి మరీ ఇచ్చేసింది. దీంతో మల్లన్న సాగర్ సమస్య సమసిపోయింది. ఇప్పుడు ఒక్క గ్రామం తప్ప అందరూ భూములు ఇచ్చేందుకు అంగీకరించారు.. దీంతో ట్రబుల్ షూటర్ హరీష్ రావు మరో సమస్యను చాకచక్యంగా పరిష్కరించినట్టైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *