
తెలంగాణ మంత్రి హరీష్ రావు అర్ధరాత్రి కాలినడకన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు.. సాదాసీదా తిరుమలకు వచ్చిన హరీష్ టీషర్ట్ ప్యాంటుతో వెళ్లారు. ఆయన భార్య ఆయనతోపాటు తిరుమలకు కాలినడకన వెంట వచ్చారు. అర్ధరాత్రి తిరుమలకు చేరుకున్న హరీష్ రావు అలిపిరి నుంచి తన కాలినడక ప్రయాణాన్ని మొదలు పెట్టారు.
అనంతరం ఈరోజు పొద్దున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబంతో దర్శించుకున్న హరీష్ కు ఆలయ పండితులు ఆశీర్వచనాలు, లడ్డూలు అందజేసి దర్శనభాగ్యం కల్పించారు.