Breaking News

కృషీవలుడు.. ఈ హరీషుడు..

harish

మహారాష్ట్రతో గోదావరి, పెన్ గంగ, ప్రాణహిత నదులపై తెలంగాణ ప్రభుత్వం కట్టే ప్రాజెక్టులకు ఒప్పందం కుదిరిందంటే అదంతా మంత్రి హరీష్ రావు కృషే.. హరీష్ రావు లేకుంటే ఈ ఒప్పందం జరిగి ఉండేదికాదని స్వయంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేసీఆర్ లు ఒప్పందం అనంతరం వ్యాఖ్యానించారంటే హరీష్ ఎంత చొరవ తీసుకున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు..
మంత్రి హరీష్ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడంలో ఎంతో కష్టపడ్డారు. గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే పట్టుదలతో హరీష్ అధికారుల బృందం కలిసి ఈ రెండేళ్లో ఎన్నో సార్లు హరీష్ రావు మహారాష్ట్రలో పర్యటించారు. మహారాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి తో అధికారులతో చర్చించారు. కనీసం రెండేళ్లలో జరగాల్సిన ఒప్పందాన్ని హరీష్ కేవలం కొన్ని నెలల్లోనే ఒప్పందం జరిగేలా కృషి చేయడంలో సఫలీకృతం అయ్యారు. సమైక్య రాష్ట్రంలో ఎప్పుడూ మహారాష్ట్రతో గొడవలు పెట్టుకొని ఇన్నాల్లు ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ , టీడీపీలకు కేసీఆర్, హరీష్ ల కృషి ఫలితంగా తెలంగాణ పచ్చసింగారం కట్టుకుబోతోంది. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వచ్చే 3 ఏళ్లలో తెలంగాణ బీడు పొలాలకు నీరందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ నిజంగా తెలంగాణకు ఒక వరంలా మారాడనంలో సందేహం లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *