రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ హరీష్ గ్రేట్ అబ్బా..

0

మంత్రి హరీష్ రావు దూకుడులోనే కాదు.. పనులు చక్కబెట్టడంలో నిధులు రాబట్టడంతో వాటితో పనులు పూర్తి చేయడంలో ఆరితేరిన నాయకుడు.. అందుకే హరీష్ రావుకు పని అప్పగిస్తే అది పూర్తవడం పక్కా అంటారు అందరూ.. కేసీఆర్ అందుకే ఏరికోరి వివిధ ఎన్నికల బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తుంటారు..
రాష్ట్రం విషయంలోనే కాదు కేంద్రంలో కూడా ఒక మంచి ఐడియా ఇచ్చి హరీష్ హౌరా అనిపించారు. కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతిని పలుసార్లు కలిసిన హరీష్ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు నిధుల విషయంపై సాయం కోరేవారు. కానీ నిధుల లభ్యత కొరత దృష్ట్యా.. అది సాధ్యపడలేదు. కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీలో హరీష్ సభ్యుడు..ఆయన్ను కేంద్ర మంత్రి ఉమాభారతి నియమించారు. దీంతో ఇప్పుడు నాబార్డుతో రుణం కోసం ఎంవోయూ కుదుర్చుకుంటే నిధుల సమస్య ఉండని అప్పట్లో హరీష్ ఉమాభారతి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమెతో నాబార్డును ఒప్పించి ఎంవోయూ చేసుకోబోతోంది. ఈకార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్రమంత్రి హరీష్ కు ప్రత్యేకంగా లేఖ రాశారట.. ఈ ఒప్పందం , ప్రాజెక్టుల కు నిధులు రాబట్టడంలో హరీష్ రావు ఐడియానే కావడంతో ఆయను అమిత ప్రాధాన్యం ఇచ్చారు కేంద్ర మంత్రి ఉమాభారతి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *