దండియా ఆటలు ఆడా.. ‘లహరీ’ పడుచులు ఇడా..

4554

గణేష్ నవరాత్రి ఉత్సవాలను కరీంనగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊరువాడ, గల్లీ గల్లీ వినాయకుడి నామస్మరణతో ఊగిపోతోంది. నవరాత్రి ఉత్సవాలకు ముగింపు దశకు చేరుకుంటున్న ఈ సమయంలో మహిళలు కుంకుమార్చనలు చేస్తున్నారు. ఆదివారం నగరంలోని చాలా చోట్ల అన్నదానాలను నిర్వహించారు.

కరీంనగర్ నగరంలోని రామచంద్రపుర్ కాలనీ రోడ్ నంబర్ 2లో గల లహరి హైట్స్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని లహరి హైట్స్ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటన్ వై. సునీల్ రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా సునీల్ రావు మాట్లాడుతూ అన్నదానం మహా గొప్పదానమన్నారు. ఐకమత్యంతో ఆటలపోటీలు, గేమ్ షోస్, అన్నదానం కార్యక్రమం చేపట్టిన లహరీ కుటుంబ సభ్యులను సునీల్ రావు అభినందించారు. మేన్ రోడ్ నుంచి లహరి హైట్స్ వరకు సిమెంట్ రోడ్డు వెంటనే మంజూరి చేయిస్తానని.. మొక్కలు నాటిస్తానని హామీ ఇచ్చారు. వాటి చుట్టు వారం రోజుల్లో టీగార్డ్స్ అందిస్తానని సునీల్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లహరి హైట్స్ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అయిలు రమేశ్, అధ్యక్షులు మున్ననూరు రమేశ్, కార్యదర్శి సిరిపురం వేణుకుమార్, సాంస్కృతిక విభాగ కన్వీనర్ జారాతి మధు, కోశాధికారి పాత్కనూరి కిషోర్, సభ్యులు చీకోటి శేఖర్, ఆవల వినోద్, పోకల అశోక్, ఇండ్ల తిరుపతి, చెక్కబండి రవిచంద్రరెడ్డి, మాల్వే తిరుపతి , డాక్టర్ దాసు సత్తిలింగం,   పోలీస్ మహేష్  , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అన్నదానం అనంతరం లహరీ హైట్స్ లోని అపార్ట్ మెంటు మహిళలు దాండియా ఆడారు.. మహిళలు కోలలు పట్టుకొని ఒకరినోకరు ఆనందోత్సవాల మధ్య ఆడిపాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *