Breaking News

పటేళ్లు కొంప ముంచారు..

anandi

గుజరాత్ రావణకాష్టంలా తయారైంది. బీజేపీ కంచుకోటగా మార్చిన నరేంద్రమోడీ నిష్ట్రమణతో గుజరాత్ లో అసమ్మతి వాదులు చెలరేగారు.. పటేళ్ల ఉద్యమం తారాస్తాయికి చేరింది. హార్దిక్ పటేల్ పటేళ్ల ఉద్యమాన్ని రాజేసి గుజరాత్ ను అల్లకల్లోలం చేశారు. ఇక దళితులపై గోమాంసం తింటున్నారని బట్టలుడదీసి కొట్టిన బీజేపీ నాయకుల ఆగడాలు ఆరాష్ట్రంలో మరో ఉద్యమానికి నాంది పలికాయి. దళితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇటు పటేళ్లు, అటు దళితుల దెబ్బకు గుజరాత్ లో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది.

మోడీ కంచుకోటను బీటలు వారేలా చేసిన గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది ఈ ఆరని జ్వాలను ఆర్పడం ఇక తనతో కాదని గద్దె దిగుతోంది.  గుజరాత్ సీఎం పదవికి తనకు 75 ఏళ్లు  నిండిన కారణంగా వయసు పైబడి పోయిందని.. సీఎంగా తప్పించాలని ఆనంది పార్టీ అధినాయకత్వానికి విన్నవించారు. దీంతో ఆమె మార్పు అనివార్యమైంది. వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్ అసెంబ్లీ  ఎన్నికల్లో బీజేపీ గెలవడం అనుమానమే.. దీంతో పీఎంగా ఇది ప్రధానికి అవమానం.. అందుకే ఈ సీఎం మార్పు కల్లోలం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *