
బాలక్రిష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాత కర్ణి దుస్తుల కోసం ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతూలుల్లాను సంప్రదించారట గౌతమి పుత్ర దర్శకుడు, నిర్మాతలు.. 1వ శతాబ్ధంలో జరిగిన రాజుల కాలం నాటి కథ కావడంతో అప్పటి సంస్కృతి, వేషధారణ కు అనుగుణంగా దుస్తులు తయారుచేయాలని ఆమెను కోరారట.. దీనికి ఆమెకూడా సరేనని ప్రస్తుతం శాతకర్ణి సినిమాకోసం పనిచేస్తుందట..
నీతూ లుల్లా గతంలో బాలీవుడ్ బిగ్ చారిత్రక సినిమాలైన దేవదాస్, జోథా అక్బర్ లకు పనిచేసి ఆయా దుస్తులు రూపొందించింది. ఇప్పుడు గౌతమి పుత్ర సినిమా కోసం కూడా ఆమె బాధ్యతలు తీసుకొని ఆ పనిలో బిజిగా ఉందట.. అంతేకాదు ప్రఖ్యాత జువెల్లరీ డిజైనర్స్ తో కలిసి శాతకర్ణి మూవీకోసం అభరణాలను సైతం తయారు చేయిస్తున్నట్టు సమాచారం. అమరావతి నగర నిర్మాణం కూడా ఇందులో డిజైన్ చేయనున్నట్టు తెలిసింది. మొత్తానికి బాలయ్య 100 చిత్రం చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదనిపిస్తోంది.