గౌడ ఆణిముత్యాలకు ఘన సన్మానం

IMG-20160619-WA0002

గౌడ కులసంఘంలో పుట్టి ఉన్నత శిఖరాలకు ఎదిగిన యువ అధికారులను గౌడ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. కరీంనగర్ నగర సమీపంలోని రేకూర్తి రాజాశ్రీ గార్డెన్ లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది.

తెలంగాణ గౌడ సంఘాల నాయకులు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ తో పాటు ఇటీవలే ఐఏఎస్ కు ఎంపికైన శ్రీధర్ గౌడ్, ఐఆర్ఎస్ సాధించిన చింతాకుమార్ గౌడ్, విశిష్ట సేవలందించిన డాక్టర్ విజయ్ భాస్కర్ , పెద్దంపేట శంకర్, కుమారి మేఘలను శాలువ, బొకేలతో ఘనంగా సన్మానించారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గౌడ సంఘం నాయకులు కలిసి రాజశ్రీ గార్డెన్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి గౌడ ఈ ఆణిముత్యాలను ఘనంగా సన్మానించారు.

IMG-20160619-WA0001

అంతకుముందు గౌడ సంఘం నాయకులు.. కరీంనగర్ శివారులో గల అల్గునూర్ లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి ర్యాలీగా బయలు దేరి నగరం మీదుగా రేకుర్తి రాజశ్రీ గార్డెన్ కు బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం సుదర్శన్ గౌడ్ సహా పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ కు ఎంపికైన యువకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీ. రాజేశం గౌడ్, మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య గౌడ్, రిటైర్డ్ డీఎస్పీ మొగులయ్య గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపగోని సారయ్య గౌడ్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు అన్నయ్య గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ అయిు రమేశ్ గౌడ్,సీఐ మహేశ్ గౌడ్, సీఐ గురువయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద , గోదావరిఖని సత్తన్న,పొన్నం సత్యంగౌడ్,  గౌడ సంఘాల నాయకులు కలర్ సత్తన్న గౌడ్, తోట రవి, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, పంజాల వేణుగోపాల్ గౌడ్, పూదరి నర్సా గౌడ్, రాజకుమారి, కోట రవి, దూలం బాలాగౌడ్ తో పాటు వేలాది మంది గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

IMG-20160619-WA0003 IMG-20160619-WA0004

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *