Breaking News

గూగుల్ డీల్ ను దాటేసిన ముంబై అన్నాదమ్ములు

card-brothers_1471938263_502x234

గూగుల్ అతిపెద్ద సెర్చింజన్ కంపెనీ.. అలాంటి గూగుల్ లావాదేవీలను మించి మార్కెట్ రేటుకు తమ సైట్ ను అమ్మి కోట్లు గడించారు ఈ అన్నాదమ్ములు.. ముంబై‌లోని శివారు ప్రాంతాల్లో పుట్టి పెరిగిన ఇద్దరు అన్నదమ్ములు దివ్యాంక్ టురఖియా(34), భవిన్(36) సెర్చింజన్ దిగ్గజం గూగుల్, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లకే ఝలక్కించారు. నగరంలోని జుహు, అంధేరిలో పెరిగిన వీరు ప్రముఖ వెబ్ వ్యాపారులుగా మారిపోయారు.
తమ మీడియా.నెట్ అనే అడ్వర్టైజింగ్ స్టార్టప్‌ను 900 మిలియన్ డాలర్ల(రూ.6.35 వేల కోట్లు)కు విక్రయించి రికార్డు సృష్టించారు. చైనా లిస్టెడ్ కంపెనీ అయిన బీజింగ్ మిటెనో కమ్యూనికేషనల్ టెక్నాలజీతో ఈ మేరకు డీల్ కుదుర్చుకుని అందులో విలీనం చేశారు. టెక్ ఇండస్ట్రీలో ఇదో పెద్ద డీల్‌గా రికార్డు సృష్టించింది. యాడ్‌మాబ్‌ను గూగుల్ 750 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా మోపబ్‌ను ట్విట్టర్ 350 డాలర్లకు కొనుగోలు చేసింది. ఆరేళ్ల క్రితం ఎన్నారై అన్నదమ్ములు ఇద్దరు కలిసి మీడియా డాట్ నెట్‌ను స్థాపించారు. గతేడాది 230 డాలర్ల వ్యాపారం చేశారు. కాగా నేటి డీల్‌తో 1.4 బిలియన్ డాలర్లకు చేరుకుందని కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దివ్యాంక్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *