ఖతమైన ‘గోల్డ్ మాన్’

ఒంటినిండా బంగారంతో చొక్కా సైతం బంగారంతో తయారు చేసింది వేసుకొని గోల్డ్ మ్యాన్ గా పేరొందిన పుణే కు చెందిన వ్యాపారవేత్త దత్తాత్రేయ పుగే హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం ఆయనను కొందరు రాళ్లతో కొట్టి,కత్తులు, కటార్లతో దాడి చేసి చంపేశారు.. ఈ హత్యకు ఆయన చిట్టీల పేరుతో మోసం చేయడమే కారణమని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆయన భార్య సీమా ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా వక్రతుండ చిట్ ఫండ్ పేరుతో మోసాలకు పాల్పడ్డ గోల్డ్ మ్యాన్ జనాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఎగొట్టాడు. అనంతరం ఒంటినిండి బంగారం, బంగారు చొక్కతో దేశవ్యాప్తంగా ప్రచారం పొంది డబ్బులు తగలేశాడు. దీనిపై ఆగ్రహంగా ఉన్న బాదితులు తెల్లవారుజామున ఆయనను కిడ్నాప్ చేసి నిర్ణన శివారు ప్రాంతాలకు తీసుకెల్లి చంపేశారు. దీంతో గోల్డ్ మ్యాన్ కథ కంచికి చేరింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *